ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు

మంచిర్యాల ఫిబ్రవరి 6 (రిపబ్లిక్ హిందుస్థాన్) మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక అక్రమ నిర్మాణాలకు పెట్టింది పేరుగా మారింది.అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు పొందుతున్నారు.అక్రమ నిర్మాణాలు కొందరు ప్రజా ప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి.అసైన్డ్ భూముల అమ్మకం,కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా అవి ఇక్కడ అమలు కావడం లేదు.ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులే ఈ దందాను యథేచ్ఛగా చేస్తున్నారని ప్రజలు గుస గుసలాడుతున్నారు.ఎకరాల చొప్పున కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా...