క్వార్టర్ ను కబ్జా చేసిన హోంగార్డ్ పై చర్యలు తీసుకోవాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (జనవరి 19) :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి  పోస్ట్ ఆఫీస్ బస్తిలోని క్వార్టర్ నంబర్ ఎస్అర్ టి 134 ను బండారి రవి అనే హోంగార్డ్ కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు సురేష్ కుమార్,రాజేష్ లు వాపోయారు. గురువారం బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బండారి రవి అనే హోంగార్డ్ తన ఇంటిని అద్దెకు తీసుకొని,అద్దె డబ్బులు ఇవ్వకపొగ,ఇల్లు నాదే,ఇంటి పక్కన క్వార్టర్ నాదే, అని అంటున్నాడని...