భారత జాతిని మేల్కొలిపిన విశ్వ విజేత వివేకానందుడు
విదేశీ గడ్డపై భారత దేశం అంటే తెలియచేసి నిద్రావస్థలో ఉన్న భారత జాతిని నిద్రలేపి దేశభక్తి, మాతృ భక్తి ని ప్రతీ భారతీయుడి గుండెల నిండా నింపిన విశ్వ విజేత వివేకానందుడు.ఈరోజు ఆయన 160 వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం.వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు వివేకానంద. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. రాజయోగ, కర్మయోగ, భక్తియోగ , జ్ఞానయోగ వంటి సాహిత్య...