కనుమరుగవుతున్న కుల వృత్తులు….. <br>రెడిమెడ్ రాకతో రోడ్డున పడ్డ వందల కుటుంబాలు
మానవ నాగరికత కుల వృత్తులపై ఆధారపడి ఉండేది. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతీది కుల వృత్తులతో అవినావ సంబంధం ఏర్పరచుకుని ఉండేది.ప్రధానంగా కమ్మరి,కుమ్మరి,కంసాలి,వడ్ల,చాకలి,మేర, మంగళి, వీటికి అధిక ప్రాధాన్యత కలిగి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినవి.కానీ నేడు రెడిమెడ్ దెబ్బకు కుల వృత్తులు కుదేలై తమకు వారసత్వంగా వచ్చిన కులవృత్తులను వదిలి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఇతర పనుల్లో చేరి తమ బ్రతుకుబండి సాగిస్తున్నారు.నూతన నాగరికత వలన మానవ సంబంధాలు తగ్గి మనిషి సంపాదన కోసం అధిక సమయం కేటాయించడం...