కొత్తపల్లిలో వింత కొమ్మ వంతెన…. అదుపు తప్పితే అంతే…
చెట్టుకొమ్మనే వంతెనగా మార్చి సాహసం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండల పరిధిలోగల కొత్తపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక మట్టి రోడ్డు పైనే రాకపోకలు కొనసాగించే గ్రామస్తులకు వర్షాకాలం వచ్చిందంటే చాలు... బాహ్యప్రపంచంతో గ్రామానికి సంబంధం తెగిపోతుంది. వాగు పై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గ్రామస్తులు సమీప వాగును దాటాలంటే చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకుని మూటముల్లె, నెత్తిన పెట్టుకొని అతికష్టం మీద వాగు దాటి...