రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని ధర్మపురి గ్రామంలో పాము కాటుకి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ధరంపూరి గ్రామానికి చెందిన కీర్సాంలే ఉత్తమ్ అప్పా (42) శుక్రవారం రొజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆవులకు మేత వేయడానికి వెళ్లి చొప్పకట్టను లేపగా అప్పటికే అందులో ఉన్న విషసర్పం అతని చేతి ఉంగరం వేలుకి కాటు వేసింది. ఈ విషయాన్ని ఉత్తమ్ కుటుంబ సభ్యులకు తెలుపుడంతో అతని కుమారుడు కీర్సాంలే శివరామ్ అప్పా హుటాహుటిన ద్విచక్ర వాహనం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతు 8 గంటలకు మృతిచెండదినట్లు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.