రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం సాయంత్రం ఆదిలాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని చాంద గ్రామ పరిసర ప్రాంతం నందు పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు గ్రామీణ ఎస్సై ఎ హరిబాబు ఆధ్వర్యంలోని బృందం దాడి చేయగా సంఘటన స్థలంలో నలుగురు పట్టుబడ్డారూ. పేకాట ఆడుతున్నా నిందితులు మొహమ్మద్ కలీం అన్సారి, షేక్ మొహమ్మద్, అబ్దుల్ సలీం మహమ్మద్ ఇక్బాల్ చౌస్, సయ్యద్ షఫీ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్దనుండి రూ.17,000 ల నగదు మరియు పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.