బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
రిపబ్లిక్ హిందుస్థాన్ : సోమవారం భారతీయ జనతా పార్టీ నేరడిగోండ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల కేంద్రంలోని సూర్య గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, మండల నూతన ఇంచార్జీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రావ్ ఆమ్టే హాజరయ్యారు. మొదట జాతీయ గీతాన్ని ఆలపించి సమావేశాన్ని ప్రారంభించారు. వక్త చొక్కపల్లి రాములు నూతన ఇంచార్జీని అందరికి పరిచయం చేశారు. అనంతరం మండల అధ్యక్షులు సోసయ్య హీరాసింగ్ మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా అందరికీ తెలిసిందేనని అన్నారు....