Boath: ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్ధార్<br> : రాజేశ్వర్ మాదిగ
రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ : గురువారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములో ఎమ్ఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పై మాదిగ ఉపకులాల అభివృద్ధిని పట్టించుకోవటం లేదని చేసిన ఆరోపణలను శుక్రవారం రోజున విలేకరుల సమావేశములో టి.ఆర్.ఎస్ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పులూటీ రాజేశ్వర్ మాదిగ తీవ్రంగా ఖండించారు.విలేకరుల సమావేశములో ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో 100 యూనిట్లకు గాను 34 యూనిట్లు మాదిగ, మాదిగ ఉపకులాలకు కేటాయించారని, మిగత ఎస్సి కులాలకన్న మాదిగ...