చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి
రిపబ్లిక్ హిందుస్థాన్ ,గుడిహత్నూర్:మండలం లోని తోషం గ్రామ శివారులో గల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వరుసకు బావ బామ్మర్డులైన తోషం గ్రామానికి చెందిన దుర్గం రమేష్ మరియు జాడి రాజేశ్వర్ గ్రామ శివారులోని చెరువులో ఆదివారం చేపలు పట్టడానికి వెళ్లారని వారితో పాటు దుర్గం రమేష్ కుమారులు కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. దుర్గం రమేష్ పెద్దకొడుకు వెంకటేష్ చెరువులోని నీటి గుంత వద్దకు వెళ్లగా ప్రమాదవశత్తు...