ఆన్ లైన్లో మట్కా నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి అరెస్టు
📰 రూ 56,360/- నగదు, సెల్ ఫోన్ స్వాధీనం.... 📰 వివరాలు వెల్లడించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం సేకరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి మరియు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ ఎస్ఐ చాకచక్యంగా దాడి చేసి నిందితుడు ఎండి ఫిరోజ్(38) ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మట్కా నిర్వాహకున్ని అరెస్టు చేసిన సిసిఎస్ సిబ్బందిని...