జిల్లాలో విస్తృతంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన కార్యక్రమాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా వ్యవస్థను నియంత్రించడానికి, ముందస్తుగానే జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ ఆర్ ప్రైమ్ బాలికల హాస్టల్ లో షీ టీం సభ్యులతో కలిసి యువతులకు సమాజంలోని మానవ అక్రమ రవాణా, కిడ్నాపింగ్, వ్యభిచారం, మహిళల అపహరణ, సైబర్ నేరాలు, బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు....