రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడా :
మండల కేంద్రం లోని తపాలా శాఖ కార్యాలయంలో ఆన్లైన్ సేవలు గతకొన్ని రోజుల నుండి పనిచేయడం లేదు. దింతో స్పీడు పోస్ట్, రిజిస్టర్ పోస్టు సేవలు నిలిచిపోయాయి.
అత్యవసర ఉత్తరాలు పంపడానికి విలులేకపోవడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం పై సబ్ పోస్ట్ ఆఫీసర్ ( పేరు వెల్లడించానికి ఇష్ట పడని ) ను వివరణ కోరగా ఆన్లైన్ సర్వీస్ ఎన్ని రోజులకు ప్రారంభం అవుతుందో చెప్పలేను… అంతగా పోస్ట్ పంపాలని ఉంటే నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్ లేకుంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి పంపు కోవాలని హితవు పలుకుతున్నారు. పై నుండి సర్వీస్ లేకుంటే నేనెమ్ చేయాలనీ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.