పోలీసుస్టేషన్లలో ల్యాండ్ పంచాయితీలు చేయము : సిపి
🔶 ఆస్తి తగాదాలతో మా వద్దకు రాకండి : రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైదరాబాద్, వెబ్ డెస్క్ : ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసు కోవాలని, కాంపౌండ్ వాల్ , ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు . రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదు లొస్తున్నాయని, వీటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. మంగళవారం నేరేడ్మెట్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్థలాలు కొనుగోలు చేస్తున్న వారు కచ్చితంగా 30 ఏండ్ల...