Adb: రాయితీ బియ్యం అక్రమ సరఫరాపై టాస్క్ ఫోర్స్ పోలీసుల నిఘా

31 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టివేత,  నిందితుని అరెస్టు.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా లో పేదలకు దక్కాల్సిన రాయితీ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వనరుగా మారింది. గుట్టచప్పుడు కాకుండా జోరుగా కొనసాగుతున్న ఈ రాయితీ బియ్యం అక్రమ సరఫరా దందా పై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించి నిఘాను పెంచారు అధికారులు. సోమవారం ఆదిలాబాద్ పట్టణం లోని తిరుపెళ్ళి పెట్రోల్ బంక్ ఎదురుగా గల ఏరియా నందు ఒక గోడౌన్ లో భారీగా రాయితీ బియ్యం నిలువ ఉందని సమాచారం సేకరించిన...