<em>ఆదివాసీ గూడాల్లో అట్టహాసంగా హోలీ సంబురాలు</em>
🔶 ఘనంగా కామదహనం పండుగ సంబరాలు... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని బాదిగూడా గ్రామంలో ఆదివాసులు హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం కామ దహనం చేశారు. హోలీ పండుగ వచ్చిదంటే చాలు ఆదివాసీ గూడలలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. గిరిజనులు ఆడే ఆటపాటలు ఆదివాసుల రంగుల వేడుకలు అడవికే అందానిస్తుంది. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవనశైలికి దురాడీ కోబ్రె (కుడుకుల) పండగ అద్దం పడుతుంది. ఆదిమ గిరిజన గూడాల్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ పండుగను రంగుల పున్నమిగా భావిస్తారు.హోళి పండుగ...