republichindustan.in
Newspaper Banner
Date of Publish : 11 March 2022, 5:32 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

<em>ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఐచర్…. ఫిర్యాదు చేసిన డ్రైవర్</em>

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
గురువారం రోజు బోథ్ నుండి ఆదిలాబాద్ కు ప్రయాణికులతో వేళ్తున్న ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ( డిపో కు అటాచ్ )ను మితిమిరిన వేగంతో వస్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి వెనుకనుండి ఢీ కొట్టింది. బోథ్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న క్రమంలో సాత్ నెంబర్ గ్రామ సమీపంలో బస్ స్టాప్ వద్ద ప్యాసెంజర్లకోసం బస్సు అపుతున్న క్రమంలో వెనుక నుండి అతివేగంగా వెనుక నుండి ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం డ్యామేజ్ అయిందని, అజాగ్రతగా వాహనం నడిపిన ఐచర్ వాహనం డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని బస్సు డ్రైవర్ గణేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.