ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నల్లబెల్లి, రిపబ్లిక్ హిందుస్థాన్: మండల కేంద్రంలోనీ గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్లెక్సీలకు రాఖీ కట్టి మహిళలు అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు పెద్దన్న లాంటి వారనీ అన్నారు. ఈ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలని...