అన్ని విధాలుగా జామిడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను : ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : జామిడి గ్రామాన్ని అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు అన్నారు. ఆదివారం రోజు గ్రామంలో స్మశానవాటిక ప్రారంభోత్సవాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జామిడి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికిధ్యానమందిర్ ను మంజూరు చేస్తానని అన్నారు.గ్రామం లో ఓ వ్యక్తి చనిపోవడం తో అనాధ అయినా కుటుంబాన్ని పరామర్శించారు....