కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి
రిపబ్లిక్ హిందుస్థాన్ ,గుడిహత్నూర్: ఆదివారం రోజు మధ్యాహ్నం గుడిహత్నూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 74వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మహాత్మా దేశ స్వాతంత్ర్య పోరాటంలో చూపినటువంటి "శాంతి అహింస"మార్గాలు ప్రపంచంలోనే ఆదర్శ వంతమైన నీతి మార్గాలు గుర్తించబడ్డాయని అన్నారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో బందీ అయిన భారత్ జాతికి స్వాతంత్ర్యన్ని తెచ్చారని అన్నారు. మహాత్మా గాంధీ...