ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
కుంరం భీమ్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గురువారం ఇచ్చోడ మండలంలోని బొజ్జుగుడా గ్రామములో ఇటీవల స్థాపించిన కుంరం భీమ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి పూలమాలతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుంరం భీం కు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కుంరం భీమ్ పోరాట పటిమను గుర్తు చేశారు. కుంరం భీమ్ ఆశయాలకనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం...