మిషన్ భగీరథ నళ్లా ఉన్న … నీళ్లు రావు
త్రాగడానికే నీళ్లు లేవు -- ఇకా స్నానాలు ఏం చేస్తాము సారు అంటున్న వర్కవాయి గ్రామస్తులు రిపబ్లిక్ హిందుస్థాన్ , గాదిగూడ : ఆదిలాబాద్ జిల్లా గాదిగుడా మండలంలోని వర్కవాయి గ్రామంలో త్రాగడానికి నీళ్లు లేక జనం తల్లడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నళ్లాలు గ్రామంలో ప్రతి ఇంటికి బిగించారు. కానీ నీళ్లు రాక అవి అలంకారప్రాయంగా మారాయి. పేరుకే మిషన్ భగీరథ కెనెక్షన్లు ఇచ్చారని వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పటేల్ టేకం లక్ష్మణ్ మాట్లాడుతూ...