రైతు బంధుతో రైతు ఇంట్లో వెలుగులు… :– మాజీ ఎంపీ గోడం నగేష్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంద్రవెల్లి : రైతుబంధు పథకంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంట్లో కేసీఆర్ వెలుగులు నింపారని మాజీ ఎంపీ గోడం నగేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బాజాభజంత్రీలతో స్థానిక మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ జాధవ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఆవరణలో ముగ్గుల...