ఒమిక్రాన్ వ‌ల్ల వ‌చ్చే ఏడాది క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంది: డ‌బ్ల్యూహెచ్‌వో

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ఈ ఏడాది ప్ర‌పంచ దేశాలు ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. డెల్టా వ్యాప్తి ముగుస్తుంద‌న‌గా, ఒమిక్రాన్ పుట్టుకొచ్చి మ‌రోసారి ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌రపెడుతోంది. క్రిస్మ‌స్, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌థ్యంలో జ‌న స‌మూహాలు పెద్ద ఎత్తున క‌న‌ప‌డే అవ‌కాశం ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఒమిక్రాన్ శ‌ర‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్‌, అమెరికా దేశాల‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భార‌త్‌లోనూ దాని వ్యాప్తి ప్రారంభ‌మైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ నిర్ధార‌ణ అవుతుండ‌డం గ‌మ‌నార్హం....