ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి, ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి – ఏబీవీపీ
ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన సాంకేతిక లోపాలను సవరించి , ఉచితంగా రివాల్యువేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎబివిపి పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ… కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెరాస సర్కారు నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభకు,ఆత్మహత్యలకు కారణమైందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ విద్యా...