బెట్టింగ్ కి పాల్పడుతున్న ఇద్దరి బుకీల అరెస్ట్
-- రెండు కోట్లకు పైగా భారీ నగదు స్వాధీనం రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్:పరిధిలో ముంబాయి కేంద్రంగా ఆన్ లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలాట బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్ బుక్స్, ఏటియం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అరెస్టు చేసిన నిందితుల వివరాలు: మాడిశెట్టి ప్రసాద్, తండ్రి పేరు వెంకటేష్, వయస్సు...