ఆఫ్ఘనిస్థాన్ మసీదులో బాంబు దాడిలో వంద మంది మృతి….
రిపబ్లిక్ హిందుస్థాన్ : అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ బాంబు పేలుడు సంభవించింది. షియా తెగకు చెందిన మసీదులో జరిగిన ఈ విధ్వంసంలో సుమారు 100 మందికి పైగా మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులో వందల మంది శుక్రవారం ప్రార్థనల్లో ఉండగా ముష్కరులు బాంబు పేలుడుకు పాల్పడ్డారని అఫ్గాన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యులుగా ఏ టెర్రర్ గ్రూప్ ప్రకటించుకోలేదు. పేలుడు తర్వాత మసీదులో...