కేసీఆర్ టార్గెట్ గా….<br>రేవంత్ వ్యూహం

◆ గులాబీదండులో గుబులు ('రిపబ్లిక్ హిందూస్థాన్' కోసం అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009, ప్రత్యేక కథనం) 'రైతుబంధు'ను ఎరగా పెట్టి ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళుతున్న కేసీఆర్ ను ఆదే రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పక్కాగా ముందుకెళ్ళాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా రైతుల కోసం కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ టార్గెట్ గా సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. సీఎంకు రైతుల మీద ప్రేమ ఉంటే ధాన్యం కొనుగోలు విషయంలో మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు… అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్...