నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా దళితబంధు ….
అమలు పై సోమవారం ప్రగతి భవన్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.... రిపబ్లిక్ హిందూస్థాన్ , హైదరాబాద్ (ప్రగతి భవన్ ) : దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం,...