republichindustan.in
Newspaper Banner
Date of Publish : 22 February 2024, 12:49 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

గొర్రెల స్కామ్ కేసులో 2.10కోట్లు కొట్టేసిన అధికారులు

గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు పశుసంవర్ధక అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీలో 2కోట్ల10 లక్షలను అధికారులు కొట్టేసినట్టు గుర్తించారు.

అసిస్టెంట్ డైరెక్టర్లు రవి, ఆదిత్య, డిప్యూటీ డైరెక్టర్ గణేష్,..డిస్టిక్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ రఘుపతిరెడ్డిలను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఈ నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచినట్టు ఏసీబీ గుర్తించింది. నిందితులను ఏసీబీ రిమాండ్‌కు అధికారులు తరలించారు.