republichindustan.in
Newspaper Banner
Date of Publish : 23 January 2022, 12:28 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

శతచండి యాగములో సతీసమేతంగా పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

ఇచ్చోడ : మండల కేంద్రములో శ్రీ కిషన్ మహరాజ్ ఆదిలాబాద్ దుర్గ ఆలయం వారి ఆధ్వర్యములో నిర్వహిస్తున్న శతచండి యాగం మొదటి రోజున ఆదివారం నాడు యాగములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సతీసమేతంగా పాల్గొన్నారు. యాగ ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి యాగాలు నిర్వహించడం వలన సుఖ శాంతులు వెల్లువిరిసి ప్రజలంతా సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుందని,విశ్వశాంతి కోసం ఇలాంటి యాగాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఇచ్చోడ ప్రాంత వాసులు అదృష్టవంతులని,నిర్వాహకులు ఐన కిషన్ మహరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు,యాగములో కార్యక్రమములో తనతో పాటు సి.ఐ వై.రమేష్ బాబు,మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి,దాసరి భాస్కర్,వెంకటేష్,రాథోడ్ ప్రవీణ్,ముసుగు గంగారెడ్డి, రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!