హైదరాబాద్, మార్చి 29: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధిని కేటాయించాలని సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ప్రభుత్వాన్ని కోరారు. ఎడారి ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ కుటుంబాల పోషణ కోసం కష్టపడుతున్న గల్ఫ్ కార్మికుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విదేశాల్లో శ్రమిస్తూ దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న కార్మికులు, సమస్యలు ఎదురైనప్పుడు సరైన సహాయం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం, వైద్య సేవలు, భద్రత కల్పించే విధంగా ప్రత్యేక నిధి అవసరమని పేర్కొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!


గల్ఫ్ కార్మికుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వలస కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పంగా మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ డిమాండ్‌కు సాటా ఫౌండర్ మల్లేశన్‌తో పాటు కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగు నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీచరణ్, మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పదాల తదితరులు మద్దతు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.