తెలుగు మీడియా ఆత్మకు శాంతి (RIP) కలగాలని నెటిజన్ల పోస్టులు….
నెటిజన్ల దెబ్బకు అబాసూపలవుతున్న తెలుగు మీడియా చానెళ్లు….
మౌనం వహిస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…..
చిన్నారి అత్యాచారం , హత్య ఘటన పై నెటిజన్లు నిందితుడిని బహిరంగంగా కాల్చిపారేయలని డిమాండ్ చేస్తున్నారు.
అత్యాచారం , హత్య వివరాలు….
ఆరేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది.
నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు రాజు అనే వ్యక్తి. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో రాజు దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులేకాదు, స్థానికులు కూడా గుండెలవిసేలా విలపించారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని సమాచారం.
పోలీసుల అదుపులో నిందితుడు….
అత్యాచారానికి పాల్పడిన మానవ మృగం , జులయిగా తిరిగే నిందితుడు రాజు అనే ఆటో డ్రైవర్ ను పోలిసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అతని సొంతూరు అడ్డగూడూరులో అతని ఇంట్లో నుండి అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్ తరలించినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
సోషల్ మీడియా లో ప్రభుత్వం పై , మీడియా పై నెటిజన్ల ఏ మేరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూడండి…..
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments