జైనథ్ సర్కిల్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
పిప్పర్ వాడ,పెన్ గంగా, బోరజ్ చెక్పోస్టులను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
సుప్రసిద్ధ జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహణ.
అదిలాబాద్: జిల్లాకు నూతనంగా విచ్చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తనదైన శైలిలో జిల్లాలో ఆకస్మిక పర్యటనలతో పోలీసు యంత్రాంగం చేస్తున్న విధులను పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు జైనథ్ పోలీస్ స్టేషన్ను, అదేవిధంగా సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. సిబ్బంది చేస్తున్న విధులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో లభ్యమైన వాహనాల పై సిబ్బందిని అడిగి ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో వచ్చే గ్రామాలు, మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న పోలీస్ స్టేషన్ల వివరాలు, నమోదయితున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్టేషన్ ఆవరణలో ఒక మొక్క నటడం జరిగింది.

పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని తెలియజేశారు. రిసెప్షన్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ రికార్డులు, స్టేషన్ రికార్డులను, లాకప్, రైటర్, సాంకేతిక నిపుణుల కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో నమోదు చేస్తూ బాధితులకు సత్వర పరిష్కారాన్ని అందజేయాలని తెలిపారు. సరిహద్దు మహారాష్ట్రతో ఉన్నందున ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పూర్తిగా రూపుమాపే దిశగా నిరంతరం సక్రమంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు. సుప్రసిద్ధ జైనథ్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి స్థల పురాణాన్ని తెలుసుకున్నారు. ఆలయాన్ని కలియతిరిగి పరిశీలించి దైవ దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి ఆలయ అధికారులు జిల్లా ఎస్పీని సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందించి గౌరవించారు. తదుపరి జైనథ్ పోలీస్ స్టేషన్లో వచ్చే పిప్పర్ వాడ టోల్ ప్లాజా ను, పెన్గంగా వద్ద సరిహద్దును, బోరజ్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సీఐ డీ సాయినాథ్, ఎస్సై వి పురుషోత్తం, పి ఎస్ ఐ మధు కృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments