రిపబ్లిక్ హిందూస్థాన్ , మంథని :
గుంజపడుగు బ్యాంక్ దొంగతనంకు సంబంధించిన ముగ్గురు దొంగల పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కొద్దీ రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో SBI బ్యాంకు దొంగతనానికి పాల్పడిన వారి వివరాలను వెల్లడించారు.
1.రాజు వసంత రావు వర్బే, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: తెలి (OBC), Occ: ఇటుక బట్టీ, r/o MIDC పడోలి, జిల్లా: చంద్రపూర్, ప్రస్తుతం గిరోలహేతి గ్రామంలో, తహాసిల్: సడక్ అర్జున్, జిల్లా: గోండియా, మహారాష్ట్ర.
2.సంకేత్ తేజ్ రామ్ ఉకే, వయస్సు: 27 సంవత్సరాలు, Occ: షాప్ కీపర్, r/o MIDC పడోలి, జిల్లా: చంద్రపూర్ మహారాష్ట్ర.
3.దేవదాస్ రూపచంద్ కాప్‌గేట్, వయస్సు: 37 సంవత్సరాలు, Occ: చికెన్ సెంటర్, నివాసం: గిరోలహేటి గ్రామం, తహశీల్: సడక్ అర్జుని, జిల్లా: గోండియా, మహారాష్ట్ర.
పై ముగ్గురు దొంగలపై రామగుండము పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ పీ.డీ.యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మంథని సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సతీష్ , ఎస్ఐ చంద్ర కుమార్ లు పీ.డీ. యాక్ట్ ఉత్తర్వులను నిందితులకి అందజేసి అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడమైనది.




