- రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి
రిపబ్లిక్ హిందూస్థాన్, బజార్ హత్నూర్ : భారతీయ జనతా పార్టీ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు.
గురువారం బజార్ హత్నుర్ మండలంలోని మాంజిరం తండా గ్రామంలో ఎంపిపీ అజాడే జయశ్రీ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నూతన పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా చేపట్టారు.
ముందుగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన జెండా గద్దె వద్ద పూజలు నిర్వహించారు.

అనంతరం గ్రామ భుత్ కమిటీ అధ్యక్షులు కేశ్రోత్ బాబులాల్ చేతుల మీదుగా బీజేపీ జెండా ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ విశ్వాగురువు గా మారిందని అన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని దీంతో ఉలిక్కి పడుతున్న కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విదంగా నూతనంగా ఎన్నికైన బీజేవైఎం నాయకులను శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుడి హత్నూర్ జడ్పిటిసి బ్రహ్మానంధ్, బోథ్ అసెంబ్లీ ఇంఛార్జి కదం బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు అమ్టే, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ సూర్యకాంత్ గిత్తే, వైస్ ఎంపిపి పోరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు గోసుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష్, బోథ్ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య, బీజేవైఎం జిల్లా కార్యదర్శి గజనంద్ , బీజేవైఎం మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్, సొసైటీ డైరక్టర్ లు చట్ల వినీల్, నిరాడి లింగన్న, అడే సంతోష్, కేశవ్, సీనియర్ నాయకులు అడ్లురి నారాయణ రెడ్డి, కార్యకర్తలు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments