దాడిచేసిన పోలీసుల పై ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి….
దాడి చేయించిన రాథోడ్ బాపురావ్ దళితులకు క్షమాపణలు చెప్పాలి …
దళిత సంఘాల డిమాండ్….. ఉట్నూర్ లో రాస్తారోకో …
రిపబ్లిక్ హిందూస్థాన్, ఉట్నూర్ / ఆదిలాబాద్ : తలమడుగు మండల కేంద్రంలో దళితుల పై పోలీసుల లాఠీచార్జి ని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ భవన్ మంజూరు అయిందని , దీనికి భూమి పూజ చేయమని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గారిని కోరగా చేయనని చెప్పి , ఆ గ్రామ సర్పంచ్ తో పాటు దళితులపై పోలీసుల చేత లాఠీచార్జి చేయించిన కొట్టించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై నిజంగా ప్రేమ ఉంటే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని మరియు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత స్థానిక పోలీసుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ రాస్తారోకోలు నిరసన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, నేతకాని హక్కుల పోరాట సమితి, మాల మహానాడు రాజకీయ పార్టీల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బిరుదుల లాజర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్ర నాయకులు కాంబ్లే బాలాజీ, రాంప్రసాద్, దూట రాజేశ్వర్, జాడి కేశవ్, అచ్చ దేవానందం, లింగంపల్లి చంద్రయ్య, గుగ్గిళ్ళ బెనహర్, బొచ్చుల రాజకుమార్, దివాకర్ బాబు, జాదవ్ వివేక్, జాదవ్ గోవింద్, రాథోడ్ కళ్యాణ్, రాథోడ్ నితీష్ కుమార్ మొదలగు దళిత గిరిజన సంఘాలు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments