Friday, February 7, 2025

గణేష్ నవరాత్రులను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలి

గణేష్ మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి…..

గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి :సిపి రామగుండము

ఈ సంవత్సరం వినాయక చవితి 10-00-2021 నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై తేదీ: 20 09-2021వ తుది నిమజ్జన కోదయాత్ర ఊరేగింపుతో ముగుస్తుంది. ఇట్టి శోభయాత్ర జరుపుకోను నేను యంలో సమస్త ప్రజల శాంతి ప్రశాంతత మరియు ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్ సమస్త రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకుని విగ్రహా మండప నిర్వాహకులందరూ కూడా తమ తమ వినాయక మండలి కార్యనిర్వాహక బృందము యొక్క వివరములు కింద తెలుపబడిన వెబ్ సైట్ లింక్ను ఉపయోగించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలియజేయమైనది.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి ,మంచిర్యాల జిల్లాల ప్రజలకు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు పోలీస్ శాఖ వారి సూచనలు కింది విధంగా ఉన్నాయి…

  1. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతి గణేష్ మండలి వారు విధిగా పోలీస్ శాఖ నుండి ముందుగా ఆన్ లైన్ లో లింక్ http://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవలను. అనుమతి కొరకు దరఖాస్తు చేయునపుడు, విగ్రహం ఎత్తు, విగ్రహాన్ని ప్రతిష్టించే తేది, నిమజ్జనం తేది మరియు మండలి యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ల వివరాలు సమర్పించ వలెను.
  2. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
  3. గణేష్ విగ్రహాలను ప్రధాన రహదారులు, ప్రజలు తిరిగే రోడ్లపై మరియు కాలిబాటల పైన ప్రతిష్టించరాదు. వాహనదారులకు, ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి అడ్డంకులు కలిగించవద్దు.
  4. గణేష్ మండపాలలో తొమ్మిది రోజుల పాటు విద్యుత్ సరఫరా కోసం సంబంధిత విద్యుత్ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు తీసుకోవాలి. విద్యుత్ అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
  5. గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో ఉంచే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  6. గణేష్ మండప నిర్వాహకులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, మండపాల వద్దకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు భౌతిక, సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కు విధిగా ధరించేలా చూడాలి. మండపాల వద్దకు వచ్చే భక్తులకు సానిటైజర్ విధిగా అందుబాటులో ఉంచాలి.
  7. మండపాల వద్ద తగిన సంఖ్యలో అవసరమైన వరకు స్థానిక, సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించి వారు భక్తులను క్రమబద్ధీకరించే విధముగా చూసుకోవాలి.
  8. మండపాల వద్ద ఉండే వాలంటీర్లు అందరికి తప్పనిసరిగా ఫోటో ఐ.డి (గుర్తింపు) కార్డులు ధరించేలా చూసుకోవాలి. మండపాల వద్ద వాలంటీర్లు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే మండపాల లోనికి అనుమతించాలి.
  9. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి.టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు.
  10. గణేష్ మండపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రములు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
  11. గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి.
  12. సమస్యాత్మక ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ట, మండపము వద్ద జరుగే కార్యక్రమములు పోలీసు వారు తెలిపిన నిబందనలకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి.
  13. గణేష్ మండపాల వద్ద జరుగు కార్యక్రమములు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపై వెళ్లే ప్రజలు, వాహన దారులకు అసౌకర్యము కలిగించకుండా చూసుకోవాలి.
  14. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను తక్కువ సౌండ్ తో రాత్రి 10-00 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదు. అదే విధంగా పాఠశాల, కళాశాల, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు.
  15. గణేష్ మండపం వద్ద ఇసుక బస్తాలను, నీటి బకెట్లను అగ్ని నిరోధకంగా అందుబాటులో ఉంచాలి.
  16. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి, పెట్రోలింగ్ కు వచ్చే పోలీస్ అధికారులతో మండపాల వద్ద ఉండే వలంటీర్లు అడిగిన సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులతో సహకరించాలి. ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా, ఏదైనా విషయం, సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా లేదా సంబందిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలి.

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.

పోలిస్ మీ కోసం ఉన్నదని మరిచి పోవద్దు. ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యత.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!