Monday, February 17, 2025

ఈ కుటుంబం ఎస్టీ కాదు అంటున్న… ఆదివాసీ ,లంబడా సమాజం

సొంత అల్లుడు , కూతురు , ఇతర అన్నదమ్ములు బంధు వర్గం అంత ఓడు (బిసి) కులం లో ఉండగా ఒక్కడినే ఎలా ఎస్టీలో చేర్చారు!? అని ప్రశ్నిస్తున్నారు జనం , ఓడు కులస్థులు… !

కాదు నేను ఎస్టీ అంటున్న సర్పంచ్ కుటుంబం…

మాజీ వైస్ ఎంపిపి దేవానంద్ కుటుంబం ఎస్టీ కాదని ఎంతోమంది ఆదివాసీ , లంబాడా నాయకులు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసారు.

సామాన్యులకు కుల ధ్రువీకరణ ఇవ్వడానికి మెలికలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగేలా చేస్తున్న ప్రస్తుత తరుణం లో ఓ కమర్షియల్ భూమి కోసం మాజీ ఎంపిపి భార్య , ఇచ్చోడ ప్రస్తుత సర్పంచ్ సునీత తల్లి చౌహన్ సయ బాయి కి సైతం ఎస్టీ లంబాడా కులదృవీకరణ పత్రం జారీ చేశారు అధికారులు.

అట్టి భూమిని ఓ నెల రోజుల క్రితం ఓ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి తన కుటుంబం సభ్యుల పేరిట కోట్ల రూపాయలకు కొన్నట్లు సమాచారం.

ధన బలం తో అతని పై అతని కుటుంబం పై ఎన్ని సార్లు ఫిర్యాదుల వెళ్లిన , తర్వాత విచారణ జరిగిన , విచారణలో సేకరించిన వివరాలు మాత్రం ఇప్పటికి బహిర్గతం కాలేవు. నిర్ణయం రాలేదు.

అధికారులు మాత్రం అతని పై విచారణ చేసి నివేదిక ఇవ్వకుండా అలాగే కోన సా…గిస్తున్నారు…. !

ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల గ్రామ పంచాయతీ మేజర్ గ్రామపంచాయతీ . కోట్ల లో ఆదాయం . ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఎస్టీ వర్గానికి సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం ఉండడంతో ఓ వ్యక్తి పక్క ప్లాన్ ప్రకారం ఎస్టీగా ధ్రువీకరణ పత్రాలు పొంది గ్రామపంచాయతీ ని గత పది పదేహేనెళ్లుగా ఎలుతున్నాడు. అసలు హక్కుదారులైన ఆదివాసీ , గిరిజన ఎస్టీలు పై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఆ విషయం విచారణ వరకు వచ్చి ఆగిపోతుంది. అయితే బయట మాత్రం మరోలా వినికిడి ఉంది.. ఎన్ని సార్లు విచారణ చేసిన ఆ వ్యక్తి ఆ విచారణ కమిటీని అందరిని కొనేస్తాడాని ప్రజల్లో చర్చ ఉంది.

*వాస్తవానికి అతను తన యొక్క అసలు నివాసం బజార్ హత్నూర్ మండలం లోని డిగనూర్ గ్రామం అంటాడు.

బజార్హతనూర్ మండలం నుండి పొందిన మైగ్రేన్ట్ సర్టిఫికేట్….

2011 లో బజార్హతనూర్ నుండి సర్టిఫికెట్ పొంది , నిజాం కాలం నాటి భూములు కొన్నట్లు కాస్తులో వ్రాయించుకున్నారు.

బజార్ హత్నూర్ తహసీల్దార్ కార్యాలయం నుండి ఇచ్చోడ కు మైగ్రేన్ట్ అవుతున్నట్లు సర్టిఫికెట్ తీసుకుని ఇచ్చోడ మండల తహశీల్దార్ కార్యాలయం నుండి ఎస్టీ లంబాడా గా కుల ధ్రువీకరణ పత్రం పొందాడు .

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం అడ్డుపెట్టుకుని గతం లో కొన్ని అనివార్య కారణాల వల్ల వలస వెళ్లిపోయిన అనాధ భూములను అప్పటి అధికారులను ‘ ఎం మాములు’ చేశాడో కానీ దాదాపు ఒక్కడే తన కుటుంబం పేరిట అన్ని వివాదాస్పద భూములనే కొన్నట్లు చూపెట్టి కాస్తూ కాలంలో రాయించుకున్నాడు. *ఇక్కడ విచిత్రం ఏమిటంటే నిజాం కాలం నాటి భూమిని సైతం తన కుటుంబం కొన్నట్లు చూపెట్టడం* .

” ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కి సంబంధించిన భూమిని కూడా కొన్నట్లు చెబుతున్నారు. కానీ ఆ వ్యక్తి దుబాయ్ లో ఉండగా ఎలా కొన్నట్లు ఆ కుటుంబం ప్రశ్నించారు. వారిని బెదిరించి ఎంతో కొంత ముట్టచెప్పి శాంతింపచేసినట్లు సమాచారం. ఆ భూమిని కూడా పట్టా చేసుకునేలా పావులు కదుపుతున్నారు. ,,

ఓ చనిపోయిన వ్యక్తి భూమిని కొన్నట్లు చూపెట్టి పట్టా చేసుకుని ఆ భూమిని రెండు నెలల క్రితం కోట్ల రూపాయలకు ఓ ఉద్యోగి కుటుంబానికి qఅమ్మినట్లు సమాచారం.

తన పై వచ్చిన ఫిర్యాదు లను మరియు విచారణను ఆపడానికి మరియు పట్టాలు జారీ కావడానికి సహకరించిన’ కలెక్టరేట్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి రెండు ఎకరాల భూమిని ఇచ్చినట్లు సమాచారం.

*సొంత కూతురు , అల్లుడు కలిసి మేము ఎస్టీ కాదని గతంలో కలెక్టర్ కు పిర్యాదు కూడా చేశారు*

* ఓ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వివాదాస్పద భూమిలో ఓ ఎకరం భూమి ఇచ్చి కుల ధ్రువీకరణ పత్రం కొరకు అతని సామాజిక వర్గానికి చెందిన వాడిగా కుల సంఘం వాడిగా రాయించుకున్నాడు.

*గ్రామపంచాయతీ లో సైతం అవినీతి అక్రమాలు …..

ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ లో కోట్ల రూపాయల ఆదాయం. ఎక్కడ ఎం పని చేశారో చెప్పమంటే వార్డ్ సబ్యులకు కూడా చెప్పని వైనం. అవినీతి అక్రమాలపై గతం లో కొందరు ఫిర్యాదు చేస్తే విచారణ చేసిన కమిటీ గ్రామపంచాయతీ లో నిధుల్లో అవినీతి జరిగిందని గుర్తించారు. లక్షల్లో అవినీతి జరిగిందని గుర్తించారు. ఇండ్లు కోడానికి పంచాయతీ ఆఫీస్ నుండి ధ్రువీకరణ పత్రం పొందాలంటే 50 వేల నుండి 80 వేల వరకు వసూలు చేస్తున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి