ధ్రువీకరణ పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం
అసాంఘిక కార్యకలాపాలపై కార్డన్ అండ్ సెర్చ్ తో ఆకస్మికంగా తనిఖీలు – డిఎస్పీ ఎన్.ఎస్వీ వెంకటేశ్వరరావు
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని బొక్కల గూడా, కొలిపురా కాలనీల్లో పోలీసులు నిర్భంద కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు .
20 మంది పోలీసు అధికారులు 60 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఇంటి ఇంటిలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్నీ చేపట్టినట్లు డిఎస్పీ ఎన్. ఎస్వీ. వెంకటేశ్వరరావు తెలిపారు.
కార్డెన్ అండ్ సెర్చ్ లో
ఏలాంటి నిజ ధ్రువపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణ పటిష్టంగా అమలు చేయడానికి కార్డెన్ అండ్ సెర్చ్ ద్వారా సోదాలు నిర్వహించినట్లు పట్టణ డిఎస్పీ ఎన్.ఎస్వీ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. బుధవారం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని బొక్కలగూడా, కొలిపురా కాలనీల్లో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్రమంలో ఎలాంటి నిజ ధ్రువ పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, జిల్లా ఎస్పీ ఏం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని కాలనీలలో వరుసగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు వెలికితీయడానికి సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు ఇంటి అద్దె ఇవ్వవద్దని, పూర్తి వివరాలు, ఆధార్ కార్డు సరిచూసుకొని నిర్ధారణ చేసుకోవాలన్నారు. కాలనీలలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐలు పోతారం శ్రీనివాస్, ఎస్. రామకృష్ణ, గుమ్మడి మల్లేష్, ఎస్సైలు జి అప్పారావు, ఏ హరిబాబు, పి.దివ్యభారతి, కె విష్ణు ప్రకాష్, మహమ్మద్ నజీబ్, ముంతాజ్ అహ్మద్, మహిళా హెడ్ కానిస్టేబుల్ పి సుజాత, 60 మంది కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.